Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

కేజీబీవీ విద్యార్థినులకు యంగ్ ఇండియా ప్రవేశ పరీక్ష

కేజీబీవీ విద్యార్థినులకు యంగ్ ఇండియా ప్రవేశ పరీక్ష

ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్‌కు ఉచిత శిక్షణ.. జూలై 12న ఎంట్రన్స్ టెస్ట్

వనపర్తి, జూలై 6: ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థినులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రవేశాల కోసం జిల్లాలోని అన్ని కేజీబీవీ పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు.

2026–27 విద్యాసంవత్సరానికి ఎంపికయ్యే విద్యార్థినులకు ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు అత్యున్నత స్థాయి ఉచిత కోచింగ్ అందించనున్నారు. దీంతో పాటు ఆధునిక విద్యా సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, 24 గంటల అకడమిక్ పర్యవేక్షణ, వసతి, భోజనం, అధ్యయన సామగ్రి, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ శిక్షణ, క్రీడలు, యోగా తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం కేజీబీవీ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందిన విద్యార్థినులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షకు హాజరుకావాలని సూచించారు.

పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత కేజీబీవీ ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని జిల్లా విద్యాశాఖాధికారి కోరారు. 

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి